తరోడ వంతెనకి భూమి పూజ.. తొలగనున్న ఇబ్బందులు
ADB: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరోడ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.12 కోట్లతో శ్రీకారం చుట్టింది. దీంతో ఆదిలాబాద్-మహారాష్ట్ర ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయి. ఆదివారం ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కలిసి నూతన వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాత వంతెన కూల్చివేసిన స్థానంలోనే ఈ నూతన వంతెన నిర్మించనున్నారు.