ఆదోనిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆదోనిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

KRNL: ఆదోని పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పార్టీ కార్యాలయాల్లో ఉదయం 8 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, రాజ్యాంగ స్ఫూర్తితో పౌర హక్కులను కాపాడుకోవాలని అధికారులు నేతలు పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో రాజకీయ నేతలు, అధికారులు పాల్గొన్నారు.