చిరుతపులి దాడిలో ఆవు మృతి

చిత్తూరు: పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె మండలం కోటూరు సమీపంలోని రిజర్వు ఫారెస్ట్‌లో ఆవు చనిపోవడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన హుస్సేన్ సాబ్ పాడి ఆవులు మేత కోసం తీసుకెళ్లిన ఆవులు ఇంటికి రాకపోవడంతో అడవిలో గాలించాడు. ఈ క్రమంలో ఆవు చనిపోవడాన్ని హుస్సేన్ సాబ్ గుర్తించాడు. చిరుతే దాడి చేసి చంపేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు.