ఏకగ్రీవాన్ని అడ్డుకున్న 'నిమిషం నిబంధన'
TG: సిరిసిల్ల(D) వీర్నపల్లి(M) భూక్యతండా పంచాయతీలో అన్ని వార్డులు ఏకగ్రీవం కాగా.. సర్పంచ్ స్థానానికి 8 మంది నామినేషన్ వేశారు. ఈ స్థానంలో మదన్ అనే అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి.. ఆరుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే, ఏడో అభ్యర్థి చివరి క్షణంలో నామినేషన్ ఉపసంహరణకు వెళ్లగా 3 నిమిషాలు ఆలస్యం అయిందని అధికారులు నిరాకరించారు.