జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు జిల్లా వాసి ఎంపిక

జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు జిల్లా వాసి ఎంపిక

వనపర్తి పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శ్రీధర్ కుమారుడు, పదో తరగతి చదువుతున్న గోనే రుద్ర జాతీయ కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 6, 7 తేదీల్లో సంగారెడ్డిలో జరిగిన ఛాంపియన్‌షిప్‌లో రుద్ర గోల్డ్ మెడల్ సాధించినట్లు మాస్టర్ శేఖర్ తెలిపారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రుద్ర పాల్గొననున్నాడు.