హర్మూజ్ దాటిన మరో రెండు నౌకలు

హర్మూజ్ దాటిన మరో రెండు నౌకలు

హర్మూజ్ జలసంధిని దాటి 'జగ్ వసంత్', 'పైన్ గ్యాస్' అనే రెండు భారీ నౌకలు అంతర్జాతీయ జలాల్లోకి విజయవంతంగా ప్రవేశించాయి. ఈ నౌకలు సుమారు 92,612 టన్నుల LPGని భారత్‌కు మోసుకొస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న ఇవి భారత ఓడరేవులకు చేరుకునే అవకాశం ఉంది. ఈ భారీ గ్యాస్ నిల్వలు దేశీయ అవసరాలను తీర్చడంలో, సరఫరాను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.