ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ

ఉద్యోగులకు హెల్మెట్లు పంపిణీ

TPT: టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం ఉదయం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే టీటీడీ ఉద్యోగులకు ప్రయాణ సమయంలో భద్రత కల్పించడంలో భాగంగా హెల్మెట్లు పంపిణీ చేయాలని నిర్ణయించామని అన్నారు.