'ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం'
RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం రాగ్యతండాలో లలితాంబిక దేవి 2వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.