పెండింగ్ ఈపీఎఫ్ చెల్లించాలని పోర్టు కార్మికుల విజ్ఞప్తి
VSP: విశాఖ పోర్ట్ ట్రస్ట్‌లో క్యాజువల్ వర్కర్స్‌గా పనిచేస్తున్న కార్మికులు తమకు పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్ నిధులు చెల్లించాలని పోర్టు కార్యదర్శి టీ. వేణు గోపాల్‌ను శుక్రవారం కోరారు. పోర్టు ట్రస్ట్ సలహా మండలి మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో పలువురు కార్మికులు కార్యదర్శిని కలిసి వినతి పత్రం సమర్పించారు.