మరో 300 'ధనుష్' గన్‌ల కోసం ఆర్డర్

మరో 300 'ధనుష్' గన్‌ల కోసం ఆర్డర్

భారత సైన్యం తన ఫిరంగి దళాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. స్వదేశీ సాంకేతికతతో తయారైన 300 అదనపు 'ధనుష్' 155 mm/45-cal హోవిట్జర్ల కోసం త్వరలోనే ఆర్డర్లు ఇవ్వాలని నిర్ణయించింది. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా రూపొందిన ఈ గన్‌లు అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. సరిహద్దుల్లో రక్షణ వ్యవస్థను పటిష్టం చేయడంలో ఇవి ఎంతో కీలకం.