'డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలి'

KKD: పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తుని పురపాలక ఛైర్ పర్సన్ నార్ల భువనసుందరి ఆదేశించారు. కమిషనర్ వెంకట్రావు, అధికారులతో కలిసి ఆమె బుధవారం పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో మొక్కలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలని తెలిపారు.