'రైతులకు అండగా ఉంటాం'

'రైతులకు అండగా ఉంటాం'

W.G: కలెక్టర్ ఆదేశాల మేరకు అకాల వర్షానికి తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేసే విధంగా మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామని ఆచంట తహసీల్దార్ కనకరాజు అన్నారు. ఆచంట మండలంలో ధాన్యం తడిసి ఇబ్బందులు పడుతున్న రైతులు తక్షణం రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించాలన్నారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందకుండా ధాన్యాన్ని అమ్ముకోవచ్చని అన్నారు.