ప్రారంభం కానున్న వైజాగ్ కో-ఆపరేటివ్ బ్యాంక్

GNTR: తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ శాఖను గురువారం ప్రారంభిస్తున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ జేవి. సత్యనారాయణమూర్తి తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆర్‌కె. మహాన ముఖ్య అతిథిగా హాజరై, 57వ బ్రాంచ్‌ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే సభలో ఆయన పాల్గొంటారని వెల్లడించారు.