కర్నూలులో పూర్తిగా పతనమైన టమోటా ధర

కర్నూలులో పూర్తిగా పతనమైన టమోటా ధర

KRNL: టమోటా ధరలు రోజురోజుకూ తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో టమోటా ధరలు భారీగా పతనమయ్యాయి. ఆస్పరి, హొలగుందలో కిలో ధర రూ. 5కి పడిపోయింది. రైతులు టమోటాలను రోడ్లపైనే పడేస్తున్నారు. రవాణా ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండలో ఇప్పటికే కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.