ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

MHBD: తొర్రూర్‌ మండలంలోని అమ్మ హాస్పిటల్, ఇమేజ్ సెంటర్‌లను జిల్లా వైద్యాధికారి డా. రవి రాథోడ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించారు. పరీక్షల నిమిత్తం ఆసుపత్రి, సెంటర్లకు వచ్చేవారి వివరాలు నమోదు చేయాలని, చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడవద్దని సూచించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.