వినాయక చవితి ఉత్సవాలకు ఎస్పీలకు మార్గదర్శకాలు

PPM: ఏపీ ప్రభుత్వం వినాయక చవితి సందర్బంగా వినాయక మండపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ విధానం తీసుకువచ్చిందని జిల్లా ఎస్పీ ఎస్.వీ. మాధవరెడ్డి తెలిపారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వినాయక చవితి ఉత్సవాల నిర్వహించవలసిన జిల్లాల ఎస్పీలకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు.