VIDEO: జిల్లా ఆర్టీసీ డిపోలో పోలీస్ గట్టి భద్రత
ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్టీసీ కార్మికుల జేఏసీ బంద్ నేపథ్యంలో శుక్రవారం మహబూబాబాద్ పట్టణంలో ఆర్టీసీ బస్ డిపో వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీస్ పహారా మధ్య అవుట్‌సోర్సింగ్ సిబ్బందితో కొన్ని బస్సులు నడిపిస్తున్నారు. బంద్‌కు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలు ప్రకటించడంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.