VIDEO: మట్టి అక్రమ తరలింపు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్
WGL: సంగెం మండల పరిధిలో మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. తీగరాజుపల్లి, షాపూర్, గ్రామాల నుంచి SRSP కెనాల్ నుంచి మొరం తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా WGLకు మొరం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. మొరం తరలింపుతో కెనాల్ కాలువ కుంగిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకువాలని డిమాండ్ చేశారు.