భీమవరంలో కేంద్ర మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం

భీమవరంలో కేంద్ర మంత్రి క్యాంప్ కార్యాలయం ప్రారంభం

W.G: భీమవరంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ క్యాంప్ కార్యాలయ ప్రారంభోత్సం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా క్యాంప్ ఆఫీస్‌లో సేవలు ఉంటాయన్నారు. ఇందులో స్థానిక అధికారులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.