సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతి

సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతి

GDWL: కాశీపురం గ్రామ సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్ సుంకన్న, అంబేద్కర్ యువజన సంఘం నేతలు గద్వాల కలెక్టర్‌ రిజ్వాన్ బాషా షేక్‌కు వినతిపత్రం అందజేశారు. కాశీపురం నుంచి అలంపూర్, తాండ్రపాడు వరకు బీటీ రోడ్డు వేయాలని, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.