విధి నిర్వహణలో జవాన్ మృతి

BPT: అమృతలూరుకు చెందిన ఆర్మీ జవాన్ నార్ల నరేష్(34) శుక్రవారం విధినిర్వహణలో మృతి చెందారు. ఈ మేరకు తహసీల్దార్ నెహ్రూ బాబు శనివారం వివరాలు వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రం పఠాన్ కోట్ రెజిమెంట్లో నరేష్ విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఉండగా వాహన ప్రమాదానికి గురై ఆయన మృతి చెందారు. నరేష్ భౌతిక కాయం ఆదివారం అమృతలూరు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.