ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట, ఓబులాపూర్ గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ధాన్యం తూకం, తేమశాతం, రసీదుల జారీ వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా కొనుగోళ్లు జరగాలని ఆదేశించారు. అధికారులు నిరంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తూ సెంటర్ ఇన్‌ఛార్జిలతో సమన్వయం చేసుకుంటూ కొనుగోళ్లు జరిగే విధంగా చూడాన్నారు.