రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు: SI

రోడ్లపై ధాన్యం ఆరబెట్టొద్దు: SI

NZB: జక్రాన్‌పల్లి మండలంలో రహదారులపై ధాన్యాలు ఆరబెట్టడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని SI హెచ్చరించారు. ఇటీవల అర్గుల్ వద్ద మొక్కజొన్న కారణంగా ఆటో–బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్‌తో పాటు రోడ్డుపై ధాన్యం పోసిన రైతుపై కేసు నమోదు చేశారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టవద్దని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.