భీమిలిలో రైతు బజార్ ప్రారంభం

భీమిలిలో రైతు బజార్ ప్రారంభం

VSP: భీమిలి గంటస్తంభం వద్ద రూ.2.6 కోట్ల వ్యయంతో నిర్మించిన రైతు బజార్, చేపల మార్కెట్లను MLA గంటా శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. నాణ్యమైన పండ్లు, కూరగాయలు, చేపలు తక్కువ ధరలకు అందేలా ఈ మార్కెట్లు ఉపయోగపడతాయని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆర్థిక స్థితి బలపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.