'జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి'
NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 25న ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని MSR డిగ్రీ కాలేజీలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సదరు కళాశాల కరస్పాండెంట్ గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి పిలుపునిచ్చారు.