ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం తనిఖీ
NLG: కేతేపల్లి మండల కేంద్రంలోని పీ పాల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పోలింగ్ బాక్సులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని DRC కేంద్రాల ఇన్‌ఛార్జిలను కలెక్టర్ ఆదేశించారు.