'మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత'

KMM: మాదకద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయదాస్ అన్నారు. ఇవాళ మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాశముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పములో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.