వేం నరేందర్ రెడ్డిని కలిసిన మాజీ మేయర్
NZB: తెలంగాణ నుంచి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని NZB మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంజయ్ మాట్లాడుతూ.. రాజ్యసభ పదవితో వేం నరేందర్ రెడ్డి బాధ్యతలు మరింత పెరిగాయన్నారు. ప్రజా సేవతో పాటు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వేం నరేందర్ రెడ్డి సమర్థుడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.