రైతులకు పురుగుమందు పిచికారీపై అవగాహన

రైతులకు పురుగుమందు పిచికారీపై అవగాహన

CTR: పలమనేరు రూరల్ మండలం కూర్మాయి రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ శాఖ అధికారిణి సంధ్యారాణి ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ ఇచ్చారు. పొలాల్లో పురుగుమందుల పిచికారీ, సంరక్షణపై అవగాహన కల్పించారు. 30 మంది రైతులకు పురుగుమందుల పిచికారీ సమయంలో వినియోగించాల్సిన చేతి తొడుగులు, కళ్లద్దాలు, మాస్కులు, ఇతర వస్తువులు అందజేశారు.