ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్

నారాయణపేట కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. మొత్తం 46 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.