ఏడు టీఎంసీలకు చేరిన ఎల్ఎండీ రిజర్వాయర్

ఏడు టీఎంసీలకు చేరిన ఎల్ఎండీ రిజర్వాయర్

KNR: కరీంనగర్ పరిధిలోని దిగువ మానేరు జలాశయం 7 TMCలకు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి కాలువల ద్వారా ఎల్ఎండీలోకి 2068 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎల్ఎండీ పూర్తి నీటి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా, రాత్రి వరకు 7.110కు చేరింది. రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.