'రైతులకు నష్టపరిహారం చెల్లించాలి'
KMM: తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు సోమశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నేలకొండపల్లి తహసీల్దార్‌తో పాటు వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆహార పంటలకు ఎకరానికి రూ.50 వేలు, వాణిజ్య పంటలకు ఎకరానికి రూ.75 వేలు నష్టపరిహారం అందిచాలని కోరారు.