రెండు రోజుల్లో గ్యాస్ సిలిండర్.. జాగ్రత్త..!
MDCL: ఉప్పల్‌లో గ్యాస్ సిలిండర్‌ను రెండు రోజుల్లోనే డెలివరీ చేస్తామని చెప్తూ సైబర్ నేరగాళ్లు ప్రత్యేక లింకులు పంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు దొంగిలించే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సందేశాలను నమ్మకుండా వెంటనే డిలీట్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.