ఆర్టీసీ డిపోలో వైద్యశాలను ప్రారంభించిన ఎంపీ
సత్యసాయి: హిందూపురం ఆర్టీసీ డిపోలో APSRTC సిబ్బంది కోసం నూతనంగా వైద్యశాల నిర్మించారు. ఆదివారం హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్యశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీను APSRTC సిబ్బంది సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.