ఎన్నికల రిటర్నింగ్ అధికారుల నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు

సత్యసాయి: జిల్లాలో ఆరు నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించినట్టు కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. పెనుకొండకు సబ్ కలెక్టర్, హిందూపురానికి జాయింట్ కలెక్టర్, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలకు ఆయా ఆర్డీవోలు, మడకశిరకు అహుడా కార్యదర్శి గౌరీ శంకర్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని కలెక్టర మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.