నేటి నుంచి టికెట్లపై ఇంధన ఛార్జీ: ఇండిగో

నేటి నుంచి టికెట్లపై ఇంధన ఛార్జీ: ఇండిగో

ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో విమాన ఇంధనం ధర భారీగా పెరిగింది. దీంతో ఇవాళ్టి నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఇంధన ఛార్జీలను వసూలు చేయనున్నట్లు ఇండిగో ప్రకటించింది. కనిష్టంగా రూ.425, గరిష్టంగా రూ.2,300 పెంచింది. దేశీయ విమానాలు, ఉపఖండంలోని గమ్యస్థానాలకు వెళ్లే సర్వీసుల్లో టికెట్లపై ఇంధన ఛార్జీ రూ.425గా ఉంది.