బుచ్చిలో వైభవంగా సీతారాముల కళ్యాణం

NLR: బుచ్చి మండలం పంచేడు గ్రామంలో జడ్పీటీసీ సూర ప్రదీప, టీడీపీ నేత సూర్య శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల కళ్యాణాన్ని జరిపారు. భక్తులు భారీగా హాజరై, కళ్యాణాన్ని తిలకించారు.