భర్తపై భార్య, బంధువులు దాడి.. కేసు నమోదు

భర్తపై భార్య, బంధువులు దాడి.. కేసు నమోదు

GNTR: అరండల్‌పేటలోని భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు దాడి వరకు వెళ్లిన ఘటన మంగళవారం జరిగింది. సాయిబాబారోడ్డుకు చెందిన కొల్లిపుర సుమంత్, భార్య ప్రవళ్లికలు వేరు కాపురం పెట్టే విషయమై గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో భార్య, ఆమె తరపు బంధువులు సుమంత్‌పై దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు సమాచారం. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.