పీరంపల్లిలో పటిష్ట బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్
వికారాబాద్ మండలం పీరంపల్లిలో కొనసాగుతున్న పోలింగ్ స్టేషన్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ను అమలు చేశారు. పీరంపల్లి గ్రామాన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా గుర్తించినందున పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఉత్కంఠ పోరు సాగుతుండడంతో ఎవరు గెలుస్తారనే విషయంపై సర్వత్రా ఎదురుచూస్తున్నారు.