బైక్ పై నుంచి జారిపడి వ్యక్తి మృతి
WGL: పర్వతగిరి మండలం దేవిలాల్ తండా క్రాస్ వద్ద జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న అజ్మీరా మోహన్ (45) అదుపుతప్పి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు గుర్తించి ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుని భార్య పార్వతి ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.