సీలేరు రహదారిపై ప్రమాద ఘంటికలు

సీలేరు రహదారిపై ప్రమాద ఘంటికలు

అల్లూరి: జీకె వీధి నుండి సీలేరు వెళ్లే ప్రధాన రహదారిపై, ముఖ్యంగా పిల్లగెడ్డ వంతెన, ఇస్ గెడ్డ వద్ద రోడ్డు భారీగా కోతకు గురైంది. రోడ్డు అంచున ప్రమాదకరమైన అగాధం ఏర్పడటంతో చిత్రకొండ వెళ్లే ప్రయాణికులు ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదం తప్పదని భయపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు.