నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలి: అదనపు కలెక్టర్

KMM: పాలేరు రిజర్వాయర్‌లో నీటి నిర్వహణ పకడ్బందీగా ఉండాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం అదనపు కలెక్టర్ పాలేరు రిజర్వాయర్‌ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రిజర్వాయర్‌లో ఉన్న నీటి నిల్వ, ఇన్ ఫ్లో ఎంత, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఎంత, వంటి వివరాలను నీటిపారుదల శాఖ అధికారుల నుంచి ఆరా తీశారు. అలాగే అధికారులకు పలు సూచనలు చేశారు.