'భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి పుణ్యక్షేత్రాల టూర్ ప్యాకేజీ'

BHPL: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కాంచీపురం, తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలకు 5 రోజుల టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఆమంచ ఇందు శనివారం తెలిపారు. ఈ నెల 19న మంగళవారం బస్సు బయలుదేరుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.