జిల్లాలో పరువు హత్య
PLD: మాచర్లలో పరువు హత్య చోటుచేసుకుంది. నవవధువు మృతి కేసు విచారణలో నిజానిజాలు బయటపడ్డాయి. ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను తండ్రి హత్య చేశాడు. ఆమెను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. పోస్టుమార్టం నివేదికలో హత్యకు సంబంధించిన వ్యవహరాలు వెలువడ్డాయి. యువతి తండ్రి చంద్రశీనుతో పాటు కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.