VIDEO: 126వ రోజుకు చేరుకున్న దీక్ష..!
KRNL: ఆదోని జిల్లా కోసం జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రీలే నిరాహార దీక్షలు ఇవాళ 126వ రోజుకు చేరాయి. సీపీఐ నేతృత్వంలో కార్మికులు సత్తార్, అంజి, వెంకటేశు, శేషావలి దీక్షలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని జేఏసీ నాయకులు వీరేశ్, నాగరాజు ప్రారంభించారు. ఇన్ని రోజులు దీక్షలు కొనసాగుతున్నా పాలక, ప్రతిపక్షాలు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.