విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం
MBNR: జిల్లా కేంద్రంలోని దేవుని గుట్ట వద్ద నూతనంగా నిర్మించిన కాటమయ్య దేవాలయంలో ఈనెల 24వ తేదీన నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరుకావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కుమార్ గౌడ్, చంద్ర కుమార్ గౌడ్ ఉన్నారు.