గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ఇంఛార్జ్
KRNL: ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో గృహప్రవేశాల ఉత్సవం ఘనంగా సోమవారం జరిగింది. టీడీపీ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి పాల్గొని వందలాది కుటుంబాలకు ఇళ్ల కల సాకారమైందని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. పేదల ఇళ్ల లక్ష్యం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.