గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
NZB: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెర్కిట్లో ఓ కుంట వద్ద గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు చెప్పారు. మృతుడి వయస్సు సుమారు 45 నుంచి 50 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతదేహాన్ని గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.