ఎస్కేయూ నూతన వీసీగా జ్యోతి కుమార్
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నూతన వైస్ ఛాన్సలర్‌గా జ్యోతి కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపుదలపై ఆయన దృష్టి సారించనున్నారు. త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.