కూలిపోయిన డ్రైనేజీ వ్యవస్థ

కూలిపోయిన డ్రైనేజీ వ్యవస్థ

VSP: మండలంలోని కొంతలం గ్రామంలో నాలుగు నెలల క్రితం నిర్మించిన డ్రైనేజీ ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయింది. గ్రామ శివారు పొలాల వద్ద ఫిబ్రవరిలో రూ.2లక్షలతో సుమారు 100 మీటర్ల పొడవున డ్రైనేజీని నిర్మించారు. అయితే నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వలనే కురిసిన వర్షాలకు ఈ డ్రైనేజీ కూలిపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబందిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.